నటుడు,నిర్మాత, దర్శకుడు పి.సత్యా రెడ్డి తన తనయుడు మనీష్ బాబుని హీరోగా పరిచయం చేస్తూ.. రాజా వన్నెం రెడ్డి దర్శకత్వంలో జనం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తోన్న చిత్రం `ప్రశ్నిస్తా`. ఈ సినిమా టీజర్‌ను బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు.
ఈ సందర్భంగా…తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ – “ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే రాజా వన్నెం రెడ్డి స్టైల్ మార్చి సినిమా చేసినట్లు కనపడుతుంది. సత్యారెడ్డి తన కొడుకు మనీష్‌ను ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఈ కొత్త ప్రయత్నం చేసిన దర్శక నిర్మాతలకు అభినందనలు. మనీష్‌కు ఈ సినిమా గుర్తింపు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
రేలంగి నరసింహారావు మాట్లాడుతూ – “ట్రైలర్ చూస్తుంటే డెఫనెట్‌గా సినిమా సూపర్‌హిట్ అవుతుందనిపిస్తుంది. సినిమాల్లో ఉన్న సత్యారెడ్డిగారు, ఆయన వారసుడిని ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారు. మనీష్‌లో చాలా పట్టుదల కనపడుతుంది. కచ్చితంగా తను మంచి హీరోగా రాణిస్తాడని భావిస్తున్నాను“ అన్నారు.
బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ – “సత్యారెడ్డిగారితో మంచి అనుబంధం ఉంది. అలాగే రాజా వన్నెంరెడ్డిగారి దర్శకత్వంలో నేను నిర్మాతగా మా ఆయన చంటి పిల్లాడు సినిమా చేశాను. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
హీరో మనీష్ బాబు మాట్లాడుతూ – “మా డైరెక్టర్‌గారు ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకుని, ప్రాక్టీస్ చేయించి సినిమా తీశారు. రాజేంద్రకుమార్‌గారు మంచి కథను అందించారు. సుధాకర్‌రెడ్డిగారు చాలా మంచి విజువల్స్ అందించారు. వెంగిగారు మంచి సంగీతం అందించారు“ అన్నారు.
రాజా వన్నెంరెడ్డి మాట్లాడుతూ – “సాధారణంగా నా సినిమాల్లో ఫ్యామిలీ టచ్, కామెడీ టచ్ ఉంటుంది. ప్రతి సిచ్చువేషన్‌లో ఎవరో చెబితే కానీ కొన్ని పనులు చేయం. అలాంటి ఘటనలను ఆధారంగా చేసుకుని కథను తయారు చేసుకన్నాం. ఇది పొలిటికల్ సినిమా కాదు. అందరి సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నాను. సత్యారెడ్డిగారు నాకు 22 ఏళ్లుగా పరిచయం ఉంది. ఆ పరిచయంతో వాళ్ల అబ్బాయిని నా చేతుల్లో పెట్టారు. మనీష్ చాలా సెన్సిటివ్.. ప్రతి విషయాన్ని నేర్చుకుని నటించాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను“ అన్నారు.
(ప్రమాణ స్వీకారానికి హరీష్‌రావు ఎలా వచ్చాడో చూడండి..https://goo.gl/AyWJva)