ప్రశాంత్ అవంతిక హీరోయిన్‌గా నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో యన్. ఎస్ క్రియేషన్స్ పతాకంపై పద్మప్రియ సమర్పణలో నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మాతగా పి. ఎల్. కె . రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ప్రాణం ఖరీదు” మూవీ థియేట్రికల్ ట్రైలర్ని దర్శక దిగ్గజం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ… అల్ ది బెస్ట్ ప్రాణం ఖరీదు మూవీ నేను టీజర్ ట్రైలర్ చూశాను చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. ఈ రోజుల్లో బాగా చదువుకున్నోళ్లు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా మంచి మంచి ఆలోచనలతో మంచి కథతో మంచి డైలాగ్స్‌తో మంచి స్క్రిన్ ప్ల్‌తో వస్తున్నారు వెల్కమ్ థెం. చిన్న సినిమాగా చూడొద్దు మంచి సినిమాలను ఆదరిస్తే ఇంకా మంచి మంచి కుర్రోళ్ళు హీరోలుగా డైరెక్టర్స్‌గా రైటర్స్‌గా వస్తారు. అల్ ధి బెస్ట్ ప్రశాంత్ అని “ప్రాణం ఖరీదు” మూవీ టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా హీరో ప్రశాంత్ మాట్లాడుతూ మా “ప్రాణం ఖరీదు”మూవీ థియేట్రికల్ ట్రైలర్ని దర్శక దిగ్గజం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేయడం చాలా సంతోషంగాఉంది. నేను రాఘవేంద్రరావుని అడగంగానే రేపు మా ఆఫీస్‌కి రమ్మని చెప్పారు. ఈ రోజు పెద్ద మనసుతో మమ్మల్ని మా ప్రాణం ఖరీదు మూవీని ఆశీర్వదించారు. రాఘవేంద్రరావుకి నా తరుపున మా టీమ్ తరుపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా ట్రైలర్ చూసి ఇంట్రెస్టింగ్‌గా ఉందనడం మాకెంతో సంతోషంగా ఉంది, మా టీం అంత ఎంతో కష్టపడి USA లో ఇండియాలో విరామం లేకుండా షూట్ చేశాము, ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాము. మా చిత్రం ఈ నెల 15న విడుదలకు సన్నాహాలు చేస్తున్నాము మా ఈ ప్రయత్నాన్ని ప్రేక్షక దేవుళ్ళు మీడియా సోదరులు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని హీరో ప్రశాంత్ తెలిపారు.
నటీనటులు ప్రశాంత్, అవంతిక, నందమూరి తారకరత్న ,షఫి, జెమినీ సురేష్ ,చిత్రం శ్రీను, ఫణి రాజమౌళి( జబర్దస్త్ ఫేమ్) సంజన,.. టెక్నిషియన్స్ కెమెరా మెన్ : మురళి మోహన్ రెడ్డి , సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ మాటలు: మారుదూరి రాజా పి ఆర్. ఓ: కడలి రాంబాబు, నిర్మాత: నల్లమోపు సుబ్బారెడ్డి, దర్శకత్వం: పి. ఎల్.కె. రెడ్డి.
Pranam Khareedu Movie Theatrical Trailer