దుమ్ములేపుతున్న ‘సాహో’ మేకింగ్ వీడియో..

263
Sahoo
- Advertisement -

‘బాహుబలి’ 1,2 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో. ఈ సినిమాలో ప్రభాస్ స‌ర‌స‌న‌ బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇండిపెండెన్స్ డే కానుకగా అగ‌స్ట్ 15న ప్ర‌పంచ‌వ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయ‌ర్‌గా విడుద‌లకి సిద్ధ‌మౌతోంది. యువీ క్రియేషన్స్ అధినేతలు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూడు భాషల్లో ఒకేసారి షూట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Saaho

అయితే రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1కి ఇప్ప‌టికే ఇండియా మొత్తం ఫుల్ క్రేజ్ వ‌చ్చింది. ప్ర‌పంచంలో వున్న రెబెల్‌స్టార్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకున్నారు. ఇక ఈ రోజు (మార్చి 3) షేడ్స్ ఆఫ్ సాహో 2 పేరిట మరో వీడియో విడుదల చేశారు. ఈ రోజు హీరోయిన్, బాలీవుడ్ అందాల భామ శ్రద్ధా కపూర్‌ బర్త్ డే కాగా, ఈ సందర్భంగా సాహో షూటింగ్ విశేషాలతో ఈ మేకింగ్‌ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ వీడియో ఇప్పుడు సెన్సేషన్‌గా మారింది. షేడ్స్ ఆఫ్ సాహో 2 వీడియోలో షూటింగ్ దృశ్యాలను, అత్యాధునిక వెపన్స్ ను, ఫైట్ సీన్లను చూపించారు. శ్రద్ధా కపూర్‌ను సైతం అభిమానులకు పరిచయం చేశారు.

ఇంత‌టి భారీ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి ర‌న్‌ రాజా రన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ ఈ భారీ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. సాహోని ఓ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్ తో పాటు హాలీవుడ్, బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. హైటెక్ యాక్ష‌న్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చిత్రీక‌రిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్‌ నటీ నటులు నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మందిరా బేడిలు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా సాహోలో ప్రభాస్ స్టైలిష్‌గా, ఓ కొత్త ఎనర్జీతో కనిపించబోతున్నారు.

- Advertisement -