- Advertisement -
భారత రాజ్యంగా ప్రధాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మునిమనువడు ప్రకాష్ అంబేద్కర్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. ప్రకాష్ అంబేద్కర్‌కు శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్, విప్ బాల్క సుమన్, ఇతర దళిత నేతలు స్వాగతం పలికారు.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ప్రకాష్ అంబేద్కర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్ అంబేద్కర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశ్వవ్యాప్తంగా గుర్తుండిపోతుందన్నారు. కేసీఆర్ లాంటి నాయకులు దేశానికి అవసరమని వివరించారు.
ఇవి కూడా చదవండి…
HMDA:హెచ్ఎండిఏకు అవార్డుల పంట..
కేసీఆర్ ముందు కేంద్రం దిగొచ్చింది: హరీశ్‌రావు
నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు…
- Advertisement -