నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు…

50
- Advertisement -

భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ 125అడుగుల ఎత్తుతో నిర్మించిన విగ్రహావిష్కరణ సందర్భంగా నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ప్రకటించారు. ఈ నేపథ్యంలో నెక్లెస్‌ రోడ్‌ ట్యాంక్ బండ్‌ హుస్సేన్‌సాగర్‌ మింట్ కంపౌండ్ మార్గాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 1గంట నుంచి రాత్రి 8గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.

నెక్లెస్ రోడ్డు, కొత్త స‌చివాల‌యం రోడ్డు వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను వివిధ మార్గాల్లో మ‌ళ్లించ‌నున్నారు. పీవీ విగ్ర‌హాం(ఖైర‌తాబాద్), ఓల్డ్ సైఫాబాద్ పోలీసు స్టేష‌న్ జంక్ష‌న్, ర‌వీంద్ర భార‌తీ జంక్ష‌న్, మింట్ కంపౌండ్ రోడ్డు, నెక్లెస్ రోట‌రీ, న‌ల్ల‌గుట్ట జంక్ష‌న్, క‌ట్ట మైస‌మ్మ టెంపుల్(లోయ‌ర్ ట్యాంక్ బండ్), ట్యాంక్ బండ్, లిబ‌ర్టీ జంక్ష‌న్ వైపు వ‌చ్చే వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని పోలీసులు సూచించారు. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో అంబేద్క‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు హాజ‌ర‌య్యే జ‌నాల‌తో ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంద‌న్నారు.

అఫ్జ‌ల్‌గంజ్ నుంచి సికింద్రాబాద్ వైపు వ‌చ్చే ఆర్టీసీ బ‌స్సులను ట్యాంక్‌బండ్ వైపున‌కు అనుమ‌తించ‌రు. ఈ మార్గంలో వ‌చ్చే ఆర్టీసీ బ‌స్సుల‌ను ర‌వీంద్ర భార‌తి, తెలుగుత‌ల్లి ఫ్లై ఓవ‌ర్, క‌ట్ట మైస‌మ్మ టెంపుల్, లోయ‌ర్ ట్యాంక్ బండ్, డీబీఆర్ మిల్స్, క‌వాడిగూడ మార్గాల్లో అనుమ‌తించ‌నున్నారు.

ట్రాఫిక్ ఆంక్ష‌ల దృష్ట్యా ప్ర‌యాణికులు, వాహ‌న‌దారులు ఈ మార్గాల్లో ప్ర‌యాణించ‌కుండా, ప్ర‌త్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఈసందర్భంగా పోలీసులకు వాహన‌దారులు స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

ఇవి కూడా చదవండి…

సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు: జేడీ

సీఎం కేసీఆర్‌ దెబ్బకు కేంద్రం దిగివచ్చింది :తోట

బీబీసీ ఇండియాపై ఈడీ కేసు..

- Advertisement -