తమిళనాడులోని అధికార డీఏంకే ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కే. అన్నామలై డీఎంకే ఫైల్స్ పేరుతో సంచలన ఆరోపణలు చేసి నెల రోజులు కూడా కాలేదు. అంతలోనే మరో సంచలనమైన విషయాలను బయట పెట్టారు. ఈ సారి డీఏంకే విత్త మంత్రి పళనివేల్ త్యాగరాజన్ మాట్లాడిన ఆడియో క్లిప్ రావడం ఇది వారంలో రెండోసారి.
తాజాగా విడుదల చేసిన ఈ ఆడియో క్లిప్‌లో సీఎం స్టాలిన్ కుటుంబం ఏవిధంగా అవినీతికి పాల్పడుతున్నట్టుగా తెలిపారు. ఈ ఆడియో క్లిప్‌ను అన్నామలై ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా డీఎంకే పార్టీ వ్యవస్థ అంతర్గతంగా ఏవిధంగా కుప్పకూలుతుందో ఇందులో వినవచ్చు. తమిళనాడు విత్తమంత్రికి సంబంధించిన రెండో ఆడియో క్లిప్ ఇది. డీఎంకే బీజేపీ మధ్య ఉన్న తేడాను తెలిపినందుకు ఆయనకు థ్యాంక్స్ అని స్పందించారు.
Also Read: KTR:రైతులకు అండగా ప్రభుత్వం
ఈ ఆడియో క్లిప్‌లో రాష్ట్ర సీఎం ఆయన కుమారుడు ఉదయనిధి అల్లుడు శబరీశన్‌లు ఏడాదిలో సుమారు రూ.30వేల కోట్లు సంపాదించారని అన్నట్టు ఉన్న ఆడియోను షేర్ చేశారు. గతంలో చేసిన ఆరోపణలపై డిఎంకే నాయకులు అన్నామలై వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడంతో పాటు తమ పరువు నష్టం కలిగించినందుకు పరిహారంగా రూ.500కోట్లను చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: దోశలు వేసిన ప్రియాంక గాంధీ..
Listen to the DMK ecosystem crumbling from within. The 2nd tape of TN State FM Thiru @ptrmadurai.
Special Thanks to TN FM for drawing a proper distinction between DMK & BJP! #DMKFiles pic.twitter.com/FUEht61RVa
— K.Annamalai (@annamalai_k) April 25, 2023