మహేష్ తో ల‌వ్ ట్రాక్.. హిలేరియ‌స్‌

40
- Advertisement -

త్రివిక్రమ్ పంచ్ కి కామెడీ టైమింగ్ ఎక్కువ. పైగా కామెడీ పండించ‌డంలో త్రివిక్రమ్ ది సెపరేట్ స్టైల్‌. వెరైటీ క్యారెక్ట‌రైజేష‌న్లు సృష్టించి, చాలా స‌హ‌జమైన వినోదాన్ని, ఆయా పాత్ర‌ల‌తో పండించ‌డంలో త్రివిక్రమ్ దిట్ట‌. త్రివిక్రమ్ హిట్ ఫార్ములా.. కామెడీనే. ప్రస్తుతం త్రివిక్రమ్, మహేష్ బాబుతో మరో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంతో మ‌రోసారి త‌న కామెడీ మార్క్ చూపింబోతున్నాడట ఈ మాటల మాంత్రికుడు. మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా రూపొందుతుంది అని ఎనౌన్స్ చేయగానే.. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి.

Also Read: పిక్ టాక్ : ఆకుపచ్చని అందాల జాతర

యాక్షన్ జోన‌ర్‌లో న‌డిచే క‌థ ఇది. అయితే త్రివిక్రమ్ సినిమాల్లో సాధార‌ణంగా క‌నిపించే ఫ‌న్ మాత్రం మిస్ అవ్వ‌ద‌ట‌. మహేష్ కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఖలేజా, అతడు సినిమాల త‌ర‌వాత‌.. మహేష్ మ‌రీ సీరియ‌స్ రోల్సే చేస్తున్నాడు. త‌ను వెండి తెర‌పై జోవియ‌ల్ గా క‌నిపించి చాలాకాల‌మైంది. అందుకే మహేష్ కూడా త్రివిక్రమ్ సినిమాపై ప్ర‌త్యేక‌మైన ఇష్టాన్ని చూపిస్తున్నాడు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల సెకండ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Also Read: ఎన్టీఆర్‌కి హాలీవుడ్ దిగ్గజం ఫిదా

మహేష్ తో శ్రీలీల ల‌వ్ ట్రాక్ ఈ సినిమాలో ఓ స్పెష‌లాఫ్ అట్రాక్ష‌న్ కాబోతోంద‌ట‌. ఈ లవ్ సీన్స్ ను షూట్ చేయడానికి ఇటీవ‌ల సారధి స్టూడియోస్‌లో ప్ర‌త్యేకంగా ఓ సెట్ ను తీర్చిదిద్దుతున్నారు. మహేష్ – శ్రీలీల ల‌వ్ ట్రాక్‌ ని ఈ సెట్ లోనే తెర‌కెక్కించనున్నారు. మహేష్ – శ్రీలీల మ‌ధ్య తెర‌కెక్కించే సీన్లు చాలా ఎంటర్ టైన్ గా ఉంటాయట. ఈ ట్రాక్ హిలేరియ‌స్‌గా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోన్న విషయం తెలిసిందే.

- Advertisement -