ప్రభాస్‌కు మరో అరుదైన అవార్డు..

262
Prabhas
- Advertisement -

ఎస్‌ ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ సినిమాతో ప్రభాస్ క్రేజ్ ప్రపంచ స్థాయికి పెరిగింది. ఇక ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్యపాత్రల్లో నటించిన బాహుబలి 2 సంచలనం సృష్టించింది. ఈ చిత్రం తెలుగులోనే కాదు.. ఇప్పటి వరకు మన దేశంలోనే ఎక్కువ బాక్సాఫీస్ కలెక్షన్లు వసూళు చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. బాహుబలి 2 రికార్డులకు ఎక్కింది. పలు వార్డులు అందుకుంది. ఇక తాజాగా ఈ చిత్రానికిగాను డార్లింగ్ ప్రభాస్ ఖాతాలో మరో అవార్డు చేరింది.

గతకొన్ని రోజుల క్రితం రష్యా లోకల్ చానెల్‌లో బాహుబలి సినిమా ప్రసారమైంది. రష్యాలోని ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రానికి అక్కడి ప్రభుత్వం ఓ అవార్డును ప్రకటిస్తుంది. రష్యాలోని ఎక్కువ మంది సినీ ప్రేక్షకులను మెప్పించిన విభాగంలో ప్రభాస్‌కు ‘రష్యా ఆడియన్స్ హార్ట్’అవార్డు దక్కింది. ఈ విషయాన్ని భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయం ప్రకటించింది. 2015గాను ప్రభాస్‌కు ‘రష్యా ఆడియన్స్ హార్ట్’అవార్డు వరించింది. ఇండియా నుంచి ఈ అవార్డు అందుకున్న రెండో భారతీయ నటుడిగా ప్రభాస్ రికార్డులకు ఎక్కాడు. గతంలో రాజ్‌ కపూర్ ఈ అవార్డులు అందుకున్నారు.

- Advertisement -