సోనూ కంటే వైఎస్ భారతి బెస్ట్: పోసాని

128
sonu sood

ఏపీ సీఎం జగన్‌,ఆయన భార్య వైఎస్ భారతిపై ప్రశంసలు గుప్పించారు సినీ నటుడు పోసాని కృష్ణమురళి. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన జగన్ తన పాలనతో ప్రజలకు మరింత చేరువ అవుతున్నారని చెప్పారు.

జగన్ పుట్టుక ముందే ఆయన కుటుంబం ఇన్‌కమ్ ట్యాక్స్ కడుతోందని తెలిపారు.పులివెందుల్లో 10 ఎస్సీ, ఎస్టీ కాలనీలు ఉన్నాయని వారికి స్ధలం కొనుగోలు చేసి ఇళ్లు కట్టించారని.. వైఎస్ ఫ్యామిలీ 5లక్షలమందికి కంటి ఆపరేషన్లు చేయించారన్నారు.

వికలాంగులు, మానసిక వికలాంగులకు వైఎస్ భారతి జగన్‌తో కలిసి సొంత డబ్బులతో ప్రత్యేకంగా స్కూల్స్ ఏర్పాటు చేశారని చెప్పారు. అందుకే సోనూసూద్ కంటే వైఎస్ భారతి లక్ష రెట్లు బెటర్ అన్నారు. ఇవన్నీ వారెప్పుడు చెప్పుకోలేదని తెలిపారు.

పరిపాలనా వికేంద్రీకరణ మంచి నిర్ణయమే అన్నారు. అమరావతి రైతులకు కూడా జగన్ న్యాయం చేస్తారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టడం మంచి నిర్ణయం అన్నారు.