ఐపీఎల్‌..ఆటగాళ్లను,సిబ్బందిని వదలని కరోనా!

236
delhi capitals

ఐపీఎల్‌ ప్రారంభానికి ముందే కరోనా ఆటగాళ్లు,సిబ్బందిని వదలడం లేదు. 13వ సీజన్ కోసం యూఏఈ వెళ్లిన పలు ప్రాంఛైజీల ఆటగాళ్లు ఇప్పటికే కరోనా బారీన పడగా తాజాగా వారి సహాయ సిబ్బంది,అధికారులకు కరోనా సోకింది.

ఢిల్లీ క్యాపిటల్స్‌ అసిస్టెంట్‌ ఫిజియోథెరపిస్ట్ పాజిటివ్‌గా పరీక్షించారు. దీంతో ఆయన సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నాడు. అసిస్టెంట్ ఫిజియో ఆటగాళ్లు, సిబ్బందితో కలువలేదని, ఒంటరిగా ఉంటున్నాడని ఐపీఎల్ అధికారులు పేర్కొన్నారు.

దీంతో ఐపీఎల్‌ కోసం వెళ్లి కరోనా మహమ్మారి బారినపడ్డ వారి సంఖ్య 15కు చేరింది. చెన్నై సూపర్‌కింగ్స్‌కు చెందిన 13 మంది ఆటగాళ్లు మహమ్మారి బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే.