బిగ్‌బాస్‌ కు నో చెప్పిన పూనమ్‌..!

274
poonam kaur
- Advertisement -

తెలుగులో 3 సీజన్‌లు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ 4వ సీజన్ కోసం సిద్ధమవుతోంది. త్వరలో బిగ్ బాస్ 4 ప్రారంభమవుతుందని స్టార్ మా అఫిషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే.కింగ్ నాగార్జునే ఈ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇందుకు సంబంధించిన యాడ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరణ జరుగుతుండగా త్వరలోనే టీజర్‌ విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరు అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతుండగా తాజాగా మరో ఆసక్తికర వార్త టీ టౌన్‌లో వైరల్‌గా మారింది. తాజాగా ఈ షో నిర్వాహకులు టాలీవుడ్ కాంట్రవర్సీ హీరోయిన్ పూనమ్ కౌర్ ను సంప్రదించారట. అయితే ఈ ఆఫర్ కు పూనమ్ నో చెప్పినట్లు ప్రచారం జరగుతోంది.

హీరోయిన్ గా కంటే కాంట్రవర్సీల ద్వారానే ఎక్కువగా గుర్తింపు సంపాదించుకున్న పూనమ్‌…బిగ్ బాస్‌కు నో చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -