సినీ నటుడు మోహన్ బాబుకు బెదిరింపులు..

24
mohan babu

సినీ నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు హల్ చల్ సృష్టించారు. మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను బెదిరించారు. గేటు దగ్గర వాచ్‌మెన్ లేకపోవడంతో కారుతో సహా లోపలికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు.

ఏపీ 31 ఏఎస్ 0004నెంబర్ గల ఇన్నోవా కారులో దుండగులు వచ్చినట్టు మోహన్ బాబు కుటుంబసభ్యులు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎవరైనా కావాలనే చేశారా లేదా ఆకతాయిలు చేసిన పనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.