నేటి నుంచి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. పాంచరాత్రాగమ విధానాలతో 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా వేడుకలు జరగనున్నాయి.
ఇటీవలె ప్రధానాలయానికి స్వర్ణ విమాన గోపురం ఏర్పాటు చేసిన నేపథ్యంలో భక్తులు భారీగా తరలివస్తారని అధికారులు తెలిపారు. ఇవాళ స్వస్తివాచనం, అంకురారోపణం జరగనుండగా ఆదివారం నుంచి 6వ తేదీ వరకు వరుసగా ధ్వజారోహణం, దేవతాహ్వానం, వేదపారాయణ, హవన, అలంకార సేవలు జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు.
ఇక 7న ఎదుర్కోలు, 8న లక్ష్మీనరసింహస్వామి తిరు కల్యాణోత్సవం, 9న దివ్య విమాన రథోత్సవం, 10న శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవం, 11న శతఘటాభిషేకం, శృంగారడోలోత్సవం, ఉత్సవ సమాప్తి కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. ఈ నెల 8న తిరుకల్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వామివారిని దర్శించుకొని పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు.
Also Read:TTD:స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ

