గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న‌..మానసి గీరిష్ చంద్రజోషి

65
gic

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ముఖ్యంగా సమాజం బావుండాలనే తపన కలిగిన ప్రతి ఒక్కరు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో పాల్గొంటున్నారు.

ఈ రోజు ఇండియన్ పారా-బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ బంగారు పతకం విజేత మానసి గీరిష్ చంద్ర జోషి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో భాగంగా గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో మొక్కలు నాటారు. అనంతరం మానసి మాట్లాడుతూ.. నేనే అనుకునే ఆలోచన నుంచి మనం అనే ఆలోచనకు ప్రతిరూపమైన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో నేను భాగస్వామిని కావడం నిజంగా గర్వకారణం. మనుషి స్వార్ధానికి ప్రకృతి చిన్నాభిన్నం అవుతండటంతోనే అనేక విపత్తులు సంభవిస్తున్నాయి.

ఇలాంటి సమయంలో మొక్కలు నాటి ఈ భూమిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. అది జరగాలంటే సమాజం పట్ల గౌరవం ఉన్న ప్రతీ ఒక్కరు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలి. సంతోష్ కుమార్ గారి ఉదాత్తమైన ఆలోచనను ముందుకు తీసుకుపోవాలి.
ఇందులో భాగంగా నేను “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”కు మరో ముగ్గురిని నామినేట్ చేస్తున్నాను. అందులో ప్రముఖ షూటర్ అన్జుమ్ మౌద్గిల్, రచయిత హర్నిద్ కౌర్, ఫ్యాషన్ స్టైలిస్ట్-బ్లాగర్ పాయల్ షా పటేల్ ను నామినేట్ చేస్తున్నట్టు తెలిపింది.