బంపర్ ఆఫర్ కొట్టేసిన పూజ..

230
pooja-hegde
- Advertisement -

భారీ సక్సెస్ లు సాధించలేకపోయినా.. పూజాకు క్రేజీ ప్రాజెక్టులు వచ్చి ఒళ్లో వాలుతున్నాయి. ఒకట్రెండు మీడియం మూవీస్ ను సౌత్ లో చేసిన సుందరికి.. ఏకంగా బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి లీడ్ హీరోయిన్ గా మొహెంజొదారో మూవీలో నటించే ఛాన్స్ వచ్చింది.

pujja

గతేడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘మొహెంజోదారో’ భారీ పరాజయాన్ని పొందడంతో పూజా హెగ్డే మళ్లీ టాలీవుడ్ తలుపు తట్టింది. ఇక్కడ బిజీ అయింది. అయితే అమ్మడి బాలీవుడ్ ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. తాజాగా సల్మాన్ ఖాన్ ‘రేస్-3’లో హీరోయిన్‌గా ఎంపికైందట ఈ మంగుళూరు బ్యూటీ. ‘రేస్’ సిరీస్‌లో రేసీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో సల్మాన్‌తో పాటు మరో హీరోగా సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో ఒక కథానాయికగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎంపికైంది.

Pooja-Hegde-

రెమో డిసౌజా తెరకెక్కించనున్న ‘రేస్-3’లో పూజా హెగ్డే సల్మాన్ సరసన నటించబోతుందా? లేక సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటించబోతుందా? అనేది సస్పెన్స్‌గా మారింది. ‘దువ్వాడ జగన్నాథమ్’ తర్వాత తెలుగులో పూజాకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా శ్రీవాస్ తెరకెక్కిస్తోన్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది పూజా. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కే చిత్రంలోనూ పూజా హెగ్డేనే హీరోయిన్ అంటున్నారు. తెలుగుతో పాటు హిందీలోనూ బిజీ అవుతున్న పూజకు భారీ సక్సెస్ తగలాల్సి ఉంది. మరి చేయబోయే చిత్రాల్లో ఏ సినిమా అమ్మడికి ఆ సక్సెస్‌ను అందిస్తుందో చూడాలి.

- Advertisement -