అఖిల్ మూవీలో స్టార్ హీరోయిన్

378
Akhil
- Advertisement -

అక్కినేని అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే ఈమూవీ షూటింగ్ ప్రారంభమైంది. అల్లు అరవింద్ ఈసినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ప్రారంభమైన కానీ ఇంత వరకు హీరోయిన్ ను కన్ఫామ్ చేయలేదు. చాలా మంది హీరోయిన్లను ఆడిషన్ చేసినా ఇంకా ఎవ్వరిని ఫైనల్ చేయలేదు. తెరపైకి చాలా మంది పేర్లు వినిపించినా చివరకు పూజా హెగ్డెను ఖారరు చేసినట్లు తెలుస్తుంది.

Pooja HedgePooja Hedge

ఫ్యామిలీ సెంటిమెంట్‌తో రాబోతోన్న ఈ సినిమాకు చక్కని టైటిల్ కూడా దొరికిందట. త్వరలోనే అధికారికంగా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను ప్రకటించనుంది చిత్రబృందం. నవంబర్ చివర్లో ఈమూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. అయితే అఖిల్ ఇప్పటి వరకు నటించిన మూడు సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు.

ఈసినిమాపై అఖిల్ భారీగా అంచనాలు పెట్టుకున్నాడు. ఎలాగైనా ఈసారి విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కూడా చాలా రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు మంచి కథతో అఖిల్ కు హిట్ ఇస్తాడని నమ్మకంతో ఈసినిమాను నిర్మిస్తున్నారు అల్లు అరవింద్.

- Advertisement -