ఆరో దశ పోలింగ్ ప్రారంభం..

217
Lok Sabha elections
- Advertisement -

నేడు దేశవ్యాప్తంగా ఆరో విడత సార్వత్రిక ఎన్నికలు జరగుతున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా 6 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సహా, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు ఆదివారం ఉదయం 7గంటల నుండి సాయంత్రం 6 వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.

మధ్యప్రదేశ్-8, ఢిల్లీ-7, హరియాణా-10, జార్ఖండ్-4, పశ్చిమబెంగాల్-8, బిహార్-8, ఉత్తరప్రదేశ్-14 స్థానాలకు ఎన్నికల అధికారులు పోలింగ్‌ను చేపట్టారు. ఆరో దశ ఎన్నికల పోలింగ్‌లో మొత్తం 979 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 1,13,167 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు. 10,17,82,472 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 5,42,60,965 మంది పురుష ఓటర్లు.. 4,75,18,226 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 3,281 మంది ఉన్నారు.

ఈ దఫా ఎన్నికల బరిలో కేంద్ర మంత్రులు రాధామోహన్‌సింగ్, హర్షవర్ధన్, మేనకాగాంధీ, నరేంద్రసింగ్ తోమర్, రావు ఇంద్రజిత్‌సింగ్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, భూపీందర్‌సింగ్ హుడా, జ్యోతిరాదిత్య సింధియా, షీలాదీక్షిత్, బాక్సింగ్ క్రీడాకారుడు విజేందర్‌సింగ్, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తదితరులు ఉన్నారు.

- Advertisement -