అల్లు హీరో కోసం అతిథిగా వస్తున్న నాని..

197

యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ హీరోగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ పతాకాలపై రూపొందుతోన్న ఎంటర్‌టైనర్‌ ‘ఏబీసీడీ’. ‘అమెరిక్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశి’ ట్యాగ్‌ లైన్‌. సంజీవ్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమాను మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని నిర్మిస్తున్నారు. ఈ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సినిమాకు క్లీన్ `యు` స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. సినిమాను మే 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్ చేస్తున్నారు.

మే 13న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌కు నేచుర‌ల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా వ‌స్తున్నారు. స్టార్ సింగ‌ర్ సిద్ శ్రీరాం ఆల‌పించిన `మెల్ల‌మెల్ల‌గా… ` సాంగ్ సెన్సేష‌న్ క్రియేట్ చేసి 25 మిలియ‌న్ వ్యూస్‌ను రాబట్టుకోగా…. ట్రైల‌ర్ సినిమాలో ఎంట‌ర్‌టైనింగ్ పార్ట్‌కు మ‌చ్చుతున‌క‌లా క‌న‌ప‌డుతుంది. ఈ ప్రీ రిలీజ్ వేడుక‌లో జుధా సాంధీ సంగీత సార‌థ్యంలో పాట‌ల సీడీని ఆవిష్క‌రించ‌నున్నారు.