- Advertisement -
ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి, అధికార బీజేడీ సీనియర్ నేత నవకిశోర్ దాస్‌పై ఓ పోలీస్ కాల్పులు జరిపారు. కాల్పులు జరిపింది ఏఎస్సై గోపాల్ దాస్ అని ఉన్నతాధికారుల ప్రాధమిక విచారణలో తేలింది. ఝార్సిగూడ జిల్లా బ్రజరాజునగర్‌లోని గాంధీచౌక్ దగ్గర ఓ ఆలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి ఇవాళ ఉదయం అక్కడికి వచ్చారు.
మంత్రి కారు డోరు తీసుకుని దిగుతుండగానే ఏఎస్సై గోపాల్ దాస్ ఆయనపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో మంత్రి ఛాతిలోకి బుల్లెట్‌లు దూసుకెళ్లాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
మంత్రి పై కాల్పులు జరిపిన ఏఎస్సై గోపాల్‌దాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.
ఇవి కూడా చదవండి..
- Advertisement -