ఏవోబీలో భారీ ఎన్‌కౌంటర్‌..24 మంది మావోలు మృతి

248
- Advertisement -

మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో 24మంది మావోయిస్టులు హతమయ్యారు. ఏవోబీ ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలోని ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లాలోని రామ్‌గఢ్‌-పనస్‌పుట్‌ మధ్య రామగుర్హ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.మృతుల్లో పురుషులు 17 మంది, ఆరుగురు మహిళలు ఉన్నారు.

ఏవోబీలో మావోయిస్టుల ప్లీనరీ సమావేశం జరుగుతున్నట్లు సమాచారం తెలుసుకున్న గ్రేహౌండ్స్‌, పోలీసులు ఏవోబీని నిన్నటి నుంచి జల్లెడ పడుతున్నారు. ఈ తెల్లవారు జామున పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీనికి ప్రతిగా పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు గ్రేహౌండ్స్‌ కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ కానిస్టేబుళ్లను హెలికాప్టర్‌ ద్వారా విశాఖకు తరలిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి నాలుగు ఏకే -47 లతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

CRPF personnel recover arms and ammunitions

ఆంధ్రా- ఒడిశాలో సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో… చనిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్టు తెలుస్తోంది. దళ కమాండర్ ఉదయ్ దళం పూర్తిగా అంతమైందని పోలీసులు చెబుతున్నారు. గార్ల రవి అలియాస్ ఉదయ్,…చలపతి, వెంకట రమణ మూర్తి అలియాస్ గణేష్ మృతి చెందినట్టు తెలుస్తోంది.

maoists-at-convention

ఇటీవల కాలంలో ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందడం ఇదే తొలిసారి. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ కుమారుడు మున్నా ఉన్నట్లు సమాచారం.మున్నా ఇటీవలే మావోయిస్టు దళంలో చేరినట్లు తెలుస్తోంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 24 మావోయిస్టులు మృతిచెందినట్లు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ సాంబశివరావు నిర్ధారించారు. సంఘటనాస్థలం నుంచి నాలుగు ఏకే47 తుపాకులు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ప్రాంతంలో మరికొందరు మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం ఉండటంతో గాలింపు కొనసాగిస్తున్నట్లు డీజీపీ తెలిపారు.

- Advertisement -