తప్పుడు దృవపత్రాలతో ఎన్నికల అఫిడవిట్ సమర్పించి గెలుపొందిన బీజేపీ కార్పొరేటర్ డేరంగుల వెంకటేశ్‌పై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రస్తుత సిట్టింగ్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ.
జీహెచ్‌ఎంసీ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారని…ఎన్నికల సమయంలో తప్పదు అఫిడవిట్ సమర్పించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సాయి చందన తన తమ్ముడు కూతురు అంటూ బోగస్ బర్త్ సర్టిఫికెట్ తయారు చేసిన ఆధారాలను ఈ సందర్భంగా అందజేశారు. కావునా డేరంగుల వెంకటేష్ పై ఫోర్జరీ, మోసం కింద కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ డివిజన్ (95) కార్పొరేటర్‌గా బీజేపీ నుంచి గెలిచిన డేరంగుల వెంకటేష్‌కు నలుగురు పిల్లలున్న విషయం దాచిపెట్టి ఎన్నికల్లో పోటీ చేశారని, టీఆర్‌ఎస్ అభ్యర్థి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా మూడు నెలల్లో విచారణ పూర్తిచేయాలని ఇప్పటికే హైకోర్డు అదేశాలు జారీ చేసింది.