‘పోచారం’.. హిస్టరీ క్రియేట్!

28
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అనూహ్య ఫలితాలు చోటు చేసుకుంటున్నాయి. బాన్సువాడ నుంచి పోటీ చేసిన బి‌ఆర్‌ఎస్ నేత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఘన విజయాన్ని అందుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిపై ఆయన 23,582 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనూ అలాగే రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత గాని.. ఒకసారి స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి రెండోసారి విజయం సాధించిన దాఖలాలు లేవు. తెలంగాణలో 2014 ఎన్నికల్లో గెలిచి స్పీకర్ బాద్యతలు చేపట్టిన మధుసుదనాచారి 2018 ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. .

అలాగే ఏపీలో కూడా 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచి స్పీకర్ బాధ్యతలు చేపట్టిన దివంగత నేత కోడెల శివప్రసాద్ 2019 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. ఇలా ఒకసారి గెలిచి స్పీకర్ పదవిలో కొనసాగిన వారు రెండోసారి ఓటమి పాలు కావడం ఖాయమనే అభిప్రాయం ఏపీ రాజకీయాల్లో కొనసాగుతూ వస్తోంది. అయితే ఈ సాంప్రదాయాన్ని బి‌ఆర్‌ఎస్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి బ్రేక్ చేశారు. భారీ మెజారిటీతో సమీప ప్రత్యర్థి నేతపై పై చేయి సాధించి విజయకేతనం ఎగురవేశారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి విజయం ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. మరి తెలంగాణలో పోచారం రికార్డ్ బ్రేక్ చేయగా ఏపీలో రాబోయే ఎన్నికల్లో ప్రస్తుతం స్పీకర్ గా పని చేస్తున్న తమ్మినేని సీతారాం ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి.

Also Read:చత్తీస్ ఘడ్‌ కాంగ్రెస్ సీఎంకు షాక్..

- Advertisement -