సోషల్‌మీడియాకు మోడీ గుడ్‌బై..!

457
pm modi
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సోషల్ మీడియాలో లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి అప్‌డేట్‌ను సోషల్ మీడియా ద్వారా వెల్లడించే మోడీ…ఇకపై ఈ ఫ్లాట్‌ఫామ్‌కు గుడ్ బై చెప్పనున్నారట.

ఈ మేరకు స్వయంగా ప్రకటన చేశారు మోడీ. ఆదివారం.. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ ఖాతాలకు వీడ్కోలు చెప్పాలని భావిస్తున్నా. దీనిపై మీకు తెలియజేస్తా ట్విట్టర్‌లో వెల్లడించారు.

సోషల్‌ మీడియాలో అత్యధికమంది ఫాలోవర్లు కలిగిన రాజకీయ నేతల్లో ప్రధాని మోదీ ఒకరు. ఆయనకు ట్విట్టర్‌లో 5.33 కోట్ల మంది, ఫేస్‌బుక్‌లో 4.4 కోట్ల మంది పాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 3 కోట్లమందికిపైగా ఫాలోవర్లతో మొదటిస్ధానంలో ఉన్నారు.

- Advertisement -