నందిని రెడ్డి దర్శకత్వంలో చైతూ..!

248
nagachaitanya

2020లో వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు దర్శకుడు నాగ చైతన్య. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరి చేస్తున్న చైతూ తర్వాత పరశురాం దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యాడు.

ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుండగా ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే లేటెస్ట్ గా మరో సినిమాకు కమిట్ అయ్యాడు చైతూ. నందిని రెడ్డి దర్శకత్వంలో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్ పై స్వప్న దత్ , ప్రియాంక దత్ నిర్మించబోతున్నారని సమాచారం. రీసెంట్ గా చైతూకి స్క్రిప్ట్ నెరేట్ చేసి గ్రీన్ సిగ్నల్ అందుకున్న నందిని రెడ్డి ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పరశురాం – నందిని రెడ్డిలలో ఎవరి సినిమా ముందుగా సెట్స్‌పైకి వెళ్తుందా అన్నది తెలియాల్సి ఉంది.