లవ్‌స్టోరీ వర్సెస్‌ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్

365
akhil
- Advertisement -

అక్కినేని హీరోలు ఒకే నెలలో సందడి చేయనున్నారు. ప్రస్తుతం నాగచైతన్య..శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్‌ స్టోరీ మూవీ చేస్తుండగా అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఒకే నెలలో విడుదల కానున్నాయి.

చైతన్య చిత్రం ‘లవ్ స్టోరీ’ మే నెలలోనే విడుదలకానుండగా అఖిల్ సినిమా కూడా అదే నెలలో రానుంది. చైతూ సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోండగా నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇక అఖిల్‌ మూవీని బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్ని అందిస్తున్న జీఏ2 పిక్చ‌ర్స్ ప‌తాకం పై బ‌న్నివాసు నిర్మిస్తున్నారు. మొత్తంగా మే నెలలో అక్కినేని అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ట్రీట్స్ పక్కా.

- Advertisement -