మోదీ నో ఎంట్రీ@రామగుండం

275
- Advertisement -

ఈనెల 12న రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన సందర్బంగా కార్మికసంఘాల వ్యతిరేతకంగా నల్లజెండాలతో నిరసనలు తెలపాలని నిర్ణయించారు. కార్మిక వ్యతిరేక విధానాలతో అనసరిస్తున్నందుకుగాను ప్రధానిమోదీ నిరసన జ్వాలలపై రగులుతున్నాయి. ఆయన పర్యటన సందర్భంగా అడ్డుకుంటామని నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలపాలని కార్మికసంఘాలు నిర్ణయించాయి.

తాజాగా మోదీ నో ఎంట్రీ అంటూ హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు వెలిశాయి. చేనేతపై విధించిన జీఎస్టీని వెనక్కి తీసుకున్న తర్వాతే తెలంగాణలో అడుగు పెట్టాలంటూ.. నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద తెలంగాణ చేనేత యూత్‌ ఫోర్స్‌ పేరుతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

గతంలో కూడా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు, వాల్‌పోస్టర్లు వెలిసిన విషయం తెలిసిందే. గత ఎనిమిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందని, ఎన్ని నిధులు ఇచ్చిందని ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇవి కూడా చదవండి..

పోలీసుల కస్టడీకి ఫౌంహౌస్‌ నిందితులు..

షర్మిల పాదయాత్ర…దండగే!

భారత్ – ఇంగ్లండ్‌ సెమీఫైనల్

- Advertisement -