బ్రిటన్ ప్రధాని రేసులో భారతీయుడు!

55
rishi

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌పై వ్యతిరేకత పెరగడంతో తదుపరి ప్రధానిగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు, భారత సంతత వ్యక్తి, బ్రిటన్ ఆర్ధిక మంత్రి రిషి సూనక్ నియమితులవుతారని బ్రిటన్ మీడియా కథనాలు ప్రచురించింది. అన్ని సమీకరణాలు రిషి సూనక్‌కు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది.

రిషి సూనక్ తర్వాత విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రస్, జాన్సన్ కేబినెట్‌లో కీలక వ్యక్తి అయిన మైకేల్ గోవ్, మాజీ విదేశాంగ, ఆరోగ్య శాఖ మంత్రి జెరిమీ హంట్, ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్, ఉప ప్రధాని డొమినిక్ రాబ్ ప్రధాని పదవి రేసులో ఉన్నారు. వీళ్లందరిలో రిషీ సూనక్‌కే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్టు మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్నాయి.

2020 మే నెలలో కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ప్రధాని బోరిస్ పెద్ద ఎత్తున మందు పార్టీ చేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి బోరిస్ జాన్సన్ దిగిపోవాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.