మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ప్రసంగం..

59
modi

ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇండియా జోడో ప్రచారాన్ని అమలు చేయాలని, నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్ అనే మంత్రంతో ముందుకు సాగాలని మోదీ పిలుపునిచ్చారు. అలాగే ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత అథ్లెట్లను ఉత్సాహపరిచడం గురించి కూడా మోదీ మాట్లాడారు. కార్గిల్ అమరవీరులను గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కావడంపై ‘నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్’ అనే నినాదాన్ని ఇచ్చారు. క్విట్ ఇండియా ప్రచారం తరహాలో దేశ ప్రజలు ఇండియా జోడో ప్రచారాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మోదీ మ‌న్ కీ బాత్‌లో మాట్లాడుతూ.. ఒడిశా, తమిళనాడుతోపాటు దేశవ్యాప్తంగా వినూత్నమైన పనులను చేపడుతున్న వారిని మోదీ ప్రశంసించారు. ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌ ప్రాధాన్యతనిస్తూ చేనేత, ఖాదీ వస్త్రాలను ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రేపు కార్గిల్ విజయ్ దివాస్. ఇది భారత సైన్యం ధైర్యానికి చిహ్నం. కార్గిల్ కథ ప్రజలంతా చదివి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కార్గిల్‌ హీరోలకు వందనం’ అని మోదీ చెప్పారు.

దేశం శతాబ్దాలుగా ఎదురుచూస్తున్న 75 సంవత్సరాల స్వేచ్ఛను మనం అనుభవిస్తున్నాం. ఇది మన అదృష్టం. ఈ సందర్భంగా ‘అమృత్ మహోత్సవ్’ బాపు సబర్మతి ఆశ్రమం నుంచి మార్చి 12 న ప్రారంభమైంది. ఇదే రోజున బాపు దండి యాత్రను కూడా పునరుద్ధరించబడింది. అప్పటి నుంచి జమ్ముకశ్మీర్ నుంచి పుదుచ్చేరి వరకు, గుజరాత్ నుంచి ఈశాన్యం వరకు.. అమృత్ మహోత్సవ్‌కు సంబంధించిన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ‘అమృత్‌ మహోత్సవ్‌’ రాజకీయ కార్యక్రమం కాదు. దేశ ప్రజలకు చెందినది. ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి’ అని పిలుపునిచ్చారు.

స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆగస్ట్‌ 15 న చేపడుతున్న జాతీయ గీత ప్రచారంలో చేరాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ రోజున ఎక్కువ మంది భారతీయులు జాతీయ గీతాన్ని ఆలపించాలన్నారు. దీని కోసం rashtragaan.in ఒక వెబ్‌సైట్ కూడా సృష్టించబడిందన్నారు. దీని సహాయంతో ఎవరైనా జాతీయ గీతం పాడి రికార్డ్‌ చేయవచ్చునని చెప్పారు. కాగా, పండుగ‌లు, శుభ‌కార్యాలు జ‌రుపుకునే స‌మ‌యంలో క‌రోనా ఇంకా తొల‌గిపోలేద‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు సూచించారు. క‌రోనా ఇంకా మ‌న మ‌ధ్యే ఉంద‌ని, కొవిడ్ నియంత్ర‌ణ నియ‌మాల‌ను మ‌ర్చిపోకూడ‌ద‌ని ఆయ‌న చెప్పారు.