బన్నీ ‘పుష్ప’లో సన్నీ..?

101
Sunny Leone

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా కనిపించబోతున్నాడు. ఈ మూవీలో రష్మిక మందన ట్రైబల్ యువతి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం షూటింగు ఎక్కువ భాగాన్ని అటవీ నేపథ్యంలో జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే కొంత భాగాన్ని కేరళలో చిత్రీకరించిన చిత్రబృందం. కరోనా లాక్ డౌన్ తర్వాత పుష్ప సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇక ఈ సినిమాలో విలన్’గా మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు.

కాగా, ఇటీవల ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ గురించి చాలా వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట కోసం ఊర్వశీ రౌటెలాను, అనన్యపాండే, దిశా పటాని, కాజల్ అగర్వాల్‌ను అడిగినట్లు టాక్ రాగా.. తాజా సమాచారం మేరకు సన్ని లియోన్‌ను చిత్రబృందం సంప్రదించిందట. అయితే ఈ సినిమాలోని ఓ ఐటెమ్ నంబర్‌లో ఆమె నటించడానికి 70 లక్షలు డిమాండ్ చేసిందని టాక్. అంత డిమాండ్ చేయడంతో దర్శక నిర్మాతలు ఖంగు తిన్నారట. దీంతో చిత్ర బృందం ఆలోచనలో పడ్డారట.. ఒకవేళ సన్నీని ఓకే చేస్తే ఈ సాంగ్ టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సాంగ్‌గా నిలవనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రాన్ని ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. పుష్ప తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో విడుదలచేయనున్నారు.