యోగా…ఆరోగ్య ప్రదాయని:మోడీ

507
modi yoga
- Advertisement -

యోగాతో మంచి ఆరోగ్యం సమకూరుతుందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. శుక్రవారం ఐదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని ప్రభాత్‌ తారా మైదానంలో దాదాపు 40వేల మంది యోగా అభ్యాసకులతో మోడీ ఆసనాలు వేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ యోగా ప్రాచీన, ఆధునిక ఆరోగ్యసాధనమని పేర్కొన్నారు. యోగా వల్ల రోగాలు దరిచేరవని, దీనిని క్రమశిక్షణ, అంకిత భావంతో పాటించాలని సూచించారు. వ్యాధులకు చికిత్సకంటే ముందస్తు నివారణ ముఖ్యమన్నారు. మారుతున్న కాలంతో పాటు ఆరోగ్యంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చిన మోడీ యోగాకు సంపన్నులు, పేదలు, కుల, మత, జాతి బేధాలు లేవన్నారు. యోగా ఎల్లప్పుడూ మన సంస్కృతిలో ముఖ్యమైన భాగం. మనమందరం యోగా సాధనను మరో స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 170 దేశాలు పాటిస్తున్నాయి. అమెరికాలో యోగాకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుండగా చైనాలో 3,000 మంది భారతీయ యోగా టీచర్లు పాఠాలు బోధిస్తున్నారు. వీరిలో అధికశాతం హరిద్వార్, రిషికేశ్ ప్రాంతాలకు చెందినవారే. ప్రస్తుతం దేశంలో ఐదు లక్షల మంది యోగా శిక్షకులు అవసరం కాగా, కేవలం 2 లక్షల మంది మాత్రమే ఉన్నారు.

- Advertisement -