గాంధీలో త్వరలో ప్లాస్మా థెరపీ ప్రారంభం..

332
Gandhi Hospital
- Advertisement -

త్వరలో గాంధీ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీ మొదలు పెడుతామని ఆసుపత్రి సుపెరిండెంట్ శ్రవణ్ తెలిపారు. ఈ రోజు కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యలపై మీడియాతో మాట్లాడారు. వెంటిలేటర్ మీద వున్న వారికి తగిన చికిత్స అందిస్తున్నాము. ప్రభుత్వం పనిచేసే సిబ్బందికి మెరుగైన సదుపాయాలు కల్పించిందన్నారు.

గాంధీలో కరోన్ కోసం 1000 కి పైగా బెడ్స్ ఏర్పాటు చేసాము. ఇక్కడ పేషెంట్స్ కోలుకుని ఇంటికి వెళుతున్నారు. ఇక్కడ పని చేసే సిబ్బందికి గాంధీ ఆసుపత్రికి దగ్గరలోనే వసతులు కల్పిస్తున్నాం. గాంధీ వైరాలజీ ల్యాబ్‌లో టెస్టులు నిరంతరంగా జరుగుతున్నాయి,24 గంటలు షిఫ్ట్ వారిగా ఉద్యోగులు పని చేస్తున్నారు అని ఆసుపత్రి సుపెరిండెంట్ శ్రవణ్ పేర్కొన్నారు.

- Advertisement -