రైల్వేలను ప్రైవేటీకరించం: కేంద్రం

216
goel
- Advertisement -

రైల్వేల ప్రైవేటీకరణపై లోక్ సభలో ప్రకటన చేశారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. లోక్‌సభలో రైల్వే గ్రాంట్స్ డిమాండ్లపై చర్చకు సమాధానమిచ్చిన గోయల్…..భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించమని… రైల్వేలు సదా భారత ప్రభుత్వంతోనే ఉంటాయని స్పష్టం చేశారు.

రైల్వేలో పెడుతున్న ప్రైవేట్ పెట్టుబడులు ఇక్కడ సేవలను మరింత మెరుగు పరుస్తాయనే ఉద్దేశంతోనే మనం స్వాగతించాలి అని చెప్పారు. ప్రధానమంత్రి నేతృత్వంలో దేశ రైల్వే మౌలిక సదుపాయాలు కొత్త విజన్‌ను చూశాయని, రైల్వే ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాలకు సమృద్ధిని తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

భారత రైల్వేలు దేశానికి వృద్ధికి ఇంజిన్‌గా పనిచేయాలని మేం కోరుకుంటున్నాం…. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో రైల్వేల అభివృద్ధి కోసం రూ.2 లక్షల కోట్లకు పైగా కేటాయించామన్నారు. రెండేండ్లలో రైలు ప్రమాదం కారణంగా ఏ ఒక్క ప్రయాణికుడు చనిపోలేదని, ప్రయాణికుల భద్రతపై రైల్వే అధికంగా దృష్టి సారిస్తుందని వెల్లడించారు.

- Advertisement -