కీలక నేత వైసీపీకి గుడ్ బై?

60
- Advertisement -

ఈ మద్య ఏపీ రాజకీయాల్లో అధికార వైసీపీ వర్గపోరుతో సతమతమౌతోంది. రామచంద్రపురం నియోజిక వర్గ సీటు విషయంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మరియు రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మద్య సీటు వార్ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజిక వర్గం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్య ప్రకాష్ ను బరిలో దింపాలని బోస్ భావిస్తున్నారు. అయితే చెల్లుబోయిన వేణు సీటు విషయంలో ఏ మాత్రం వెనక్క్తి తగ్గడం లేదు. అంతే కాకుండా తాను ఈ నియోజిక వర్గం నుంచే బరిలో దిగబోతున్నట్లు చెల్లుబోయిన వేణు ఇటీవల స్పష్టం చేశారు కూడా. ఇక పార్టీలో కూడా చెల్లుబోయిన వేణు కే సీటు కేటాయించే విధంగా వైఎస్ జగన్ సిద్దమౌతున్నారని టాక్.

Also Read:తగ్గిన పేదరికం.. దటీజ్ కే‌సి‌ఆర్!

దీంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్టీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ సీటు దక్కకపోతే కచ్చితంగా ఆయన టీడీపీ లేదా జనసేనలోకి జంప్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే రాష్ట్రంలో వైసీపీ తరువాత టీడీపీ బలమైన పార్టీగా ఉండడంతో టీడీపీ వైపే ఆయన మొగ్గు చూపే అవకాశం ఉంది. పైగా రామచంద్రపురం నియోజికవర్గంలో టీడీపీ నుంచి బలమైన అభ్యర్థిలు లేరు. ఈ నేపథ్యంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ టీడీపీలో చేరితే సీటు పక్కా అనే ఉద్దేశంలో ఉన్నారట. ఒకవేళ ఆయన వైసీపీ విడితే.. పార్టీకి గట్టి దేబ్బే అని చెప్పుకోవాలి. మొదటి మంత్రివర్గ క్యాబినెట్ లో పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రిగా కూడా పని చేశారు. దీంతో అలాంటి నేత పార్టీని విడితే.. ఆ ప్రభావం వైసీపీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొట్టే అవకాశం ఉంది. మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ విషయంలో జగన్ ఏమైనా బుజ్జగింపు చర్యలకు పాలపడతారా ? లేదా పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎగ్జిట్ ను లైట్ తీసుకుంటారా అనేది చూడాలి.

Also Read:KTR:భారీ వర్షాలు..అప్రమత్తంగా ఉండండి

- Advertisement -