KTR:భారీ వర్షాలు..అప్రమత్తంగా ఉండండి

31
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటలు వర్షాలు కురిసే అవకాశం ఉండగా ఇప్పటికే పలు జిల్లాల్లో వాగులు,వంకగలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాలపై నానక్‌రామ్‌గూడలోని కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు.

భారీ వర్షాలు కురిసినా పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రానున్న రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. భారీ వర్షం వచ్చినా ఎదుర్కొనే సిద్ధంగా ఉండాలని..అన్నిశాఖల సిబ్బంది సమన్వయంతో పని చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వరదల్లో ప్రాణనష్టం కూడదని ఆదేశించారు. ఈ సమావేశంలో పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, జోనల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

Also Read:బేబీపై సుకుమార్ కామెంట్స్!

- Advertisement -