రాజమౌళి – మహేష్.. ఓ రెండు రూమర్లు

55
- Advertisement -

మహేశ్ బాబుతో రాజమౌళి చేస్తున్న సినిమా పై యావత్తు తెలుగు సినీ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా పై ఎన్నో రూమర్లు వచ్చాయి. తాజాగా రెండు రూమర్లు వైరల్ గా మారాయి. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అమీర్ ఖాన్ కూడా నటిస్తాడని టాక్. ఇక మరో రూమర్ విషయానికి వస్తే.. ఆగస్టు 9వ తేదీన మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం మహేశ్ బాబు తన కెరియర్లోనే అత్యధిక పారితోషికాన్ని అందుకున్నాడు. అయితే, ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ అనుకున్నంత స్పీడ్ గా సాగడం లేదు. దీనికితోడు ఈ వారం శుక్రవారం నాడు మ‌హేష్ త‌న ఫ్యామిలీతో క‌లిసి వెకేష‌న్‌కు వెళ్ల‌నున్నాడ‌ని తెలుస్తోంది. త‌న కూతురు సితార బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మ‌హేష్ ఈ వెకేష‌న్‌ను ప్లాన్ చేశాడ‌ని, త‌ను మ‌ళ్లీ తిరిగి వ‌చ్చే లోపు మ‌హేష్ లేని షూటింగ్‌ను చిత్రీకరించ‌నున్నార‌ని సమాచారం.

Also Read:బేబీపై సుకుమార్ కామెంట్స్!

మరి మహేష్ ఇలా ప్రతి నెల ఫ్యామిలీతో క‌లిసి వెకేష‌న్‌కు వెళ్తే.. ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ ఇప్పట్లో పూర్తి కాదు. ‘గుంటూరు కారం’ సినిమానే పూర్తి కాకపోతే.. రాజమౌళి సినిమా ఎలా స్టార్ట్ అవుతుంది ?.. ప్రేక్షకుల్లో ఇదే అనుమానం ఉంది. కానీ, అక్కడ ఉంది రాజమౌళి, కాబట్టి.. మహేష్ కాంప్రమైజ్ అయ్యి మరీ.. రాజమౌళి సినిమాకి సన్నద్ధం అవుతాడని అంటున్నారు. ఆల్ రెడీ మహేశ్ బాబు కాల్షిట్స్‌ను జక్కన్న లాక్ చేసినట్లు వినికిడి. మొత్తానికి మహేష్ కోసం రాజమౌళి భారీగానే ప్లాన్ చేస్తున్నాడు.

Also Read:తగ్గిన పేదరికం.. దటీజ్ కే‌సి‌ఆర్!

- Advertisement -