- Advertisement -
కరోనా మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా గతేడాది మార్చి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుప్రీంకోర్టులో కేసుల విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సుప్రీంకోర్టులో భౌతిక విచారణకు సంబంధించి మార్గదర్శకాల విడుదల చేసింది. మంగళవారం, బుధవారం, గురువారం జరిగే సాధారణ, తుది విచారణలను మార్చి 15 నుంచి సుప్రీంకోర్టులో ప్రయోగాత్మకంగా భౌతికంగా విచారణ జరపనున్నారు. కోర్టు హాల్లో పరిమిత సంఖ్యలో జనం ఉండేలా చూడాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విధానం సురక్షితమని భావిస్తే క్రమంగా మిగిలిన రోజుల్లో కూడా భౌతిక విచారణలు చేపట్టనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
- Advertisement -