రివ్యూ: పేట

305
peta movie review
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్-యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పేట. 2.0 తర్వాత సంక్రాంతి కానుకగా ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చిన ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది…? త‌న‌దైన స్టైల్‌, మేన‌రిజ‌మ్స్ తో రజనీ ఫ్యాన్స్‌ని అలరించాడా..? లేదా చూద్దాం..

కథ:

కాళీ(ర‌జ‌నీకాంత్‌) ఓ కాలేజ్‌లో హాస్ట‌ల్ వార్డెన్‌. అక్క‌డ చోటు చేసుకునే ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌ల‌ను త‌న‌దైన స్టైల్‌లో ప‌రిష్కరిస్తాడు. అనుకోని పరిస్థితుల్లో ఓ ప్రేమ జంటని కలుపతాడు..సీన్ కట్ చేస్తే అప్పుడే అత‌ని పేరు కాళీ కాదు… పేట అని తెలుస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది..?అసలు రజనీ గతం ఏంటీ..?సినిమా కథ ఎలా సుఖాంతం అయిందనేది తెరమీద చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్‌ రజనీ, ఫస్టాఫ్‌. ర‌జ‌నీకాంత్‌కు ఇలాంటి పాత్ర‌లు చేయ‌డం వెన్న‌తో పెట్టిన విద్య‌. ఈ వయసులో కూడా రజనీ తన స్ధాయికి మించి నటనను కనబర్చాడు.సిమ్ర‌న్‌, త్రిష‌ల‌తో ర‌జ‌నీకాంత్ న‌డిపిన ల‌వ్ ట్రాక్ మరో హైలైట్. న‌వాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ‌సేతుప‌తి తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.

Image result for peta review

మైనస్ పాయింట్స్‌:

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ క‌థా, క‌థ‌నం,సెకండాఫ్‌. కేవ‌లం ర‌జ‌నీ అభిమానుల‌ను మెప్పించ‌డానికే స‌న్నివేశాల‌ను అల్లుకుంటూ వెళ్లాడు. సినిమాలో సెకండాఫ్‌ బోర్ కొట్టిస్తుంది. పాటలు మరో మైనస్ పాయింట్.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. త‌న‌దైన నేప‌థ్య సంగీతంతో అనిరుధ్ హోరెత్తించాడు. ర‌జ‌నీని అభిమానులు ఎలా చూడాల‌నుకుంటున్నారో అలా చూడ‌టానికి అనిరుధ్ ఇచ్చిన బీజీఎమ్స్ చ‌క్క‌గా స‌రిపోయాయి. సినిమాట్రోగ‌ఫ్రీ,ఎడిటింగ్‌ బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

తీర్పు:

ర‌జ‌నీకాంత్‌ను స్టైల్‌గా, ఎన‌ర్జీగా చూడాల‌న్న‌ది ఆయ‌న అభిమానుల క‌ల. కానీ, చాలా కాలం త‌ర్వాత ర‌జ‌నీ త‌న స్టైల్‌ను చూపించుకోవ‌డానికి పర్‌ఫెక్ట్‌గా ఉపయోగించుకున్నారు. మొత్తంగా సంక్రాంతి పండ‌గ వేళ ర‌జ‌నీ అభిమానుల‌కు వినోదాల తోట‌ పేట.

విడుదల తేదీ:10/01/19
రేటింగ్: 2.75/5
చిత్రం: పేట
న‌టీన‌టులు: ర‌జ‌నీకాంత్‌, సిమ్ర‌న్‌, త్రిష‌
సంగీతం: అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌
నిర్మాత‌: క‌ళానిధి మార‌న్‌, అశోక్ వ‌ల్ల‌భ‌నేని
ద‌ర్శ‌క‌త్వం: కార్తీక్ సుబ్బ‌రాజు

- Advertisement -