సాహో తర్వాత జాన్‌గా ప్రభాస్‌..!

250
prabhas

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న చిత్రం సాహో. భారీ బడ్జెట్‌తో త్రిభాష చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రభాస్‌ సరసన శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

మ‌రో వైపు త‌న 20వ చిత్రంగా కె కె రాధా కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న‌ ఈ చిత్రం 1970 బ్యాక్ డ్రాప్ నేప‌థ్యంలో రూపొందుతున్న‌ట్టు స‌మాచారం. చిత్రానికి జాన్ అనే టైటిల్‌ని క‌న్‌ఫాం చేసిన‌ట్టు తెలుస్తుంది.

గతేడాది ఒక్క సినిమా లేకుండా నిరాశపర్చిన ప్రభాస్‌ ఈ ఏడాది మాత్రం రెండు అదిరిపోయే చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. త్వ‌ర‌లోనే చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌నున్నార‌ని అంటున్నారు.