ఆల్‌టైం రికార్డ్.. ఆగని పెట్రో మంట..!

203
Petrol Price
- Advertisement -

గత ఎనిమిది రోజుల నుంచి లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.2.36, డీజిల్‌ రేటు రూ. 2.91 పెరిగింది. మంగళవారం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో లీటరు పెట్రోలు ధ‌ర‌ 30 పైసలు, డీజిల్ ధ‌ర 35 పైసలు పెరిగాయి. దీంతో అక్క‌డ లీట‌రు పెట్రోలు రూ.89.29, డీజిల్ ధ‌ర రూ.79.70 కి చేరింది.

ముంబైలో పెట్రోల్ ధర లీటరుకి‌ రూ.95.75కి చేరింది. అలాగే, డీజిల్‌ ధర రూ.86.35కు ఎగ‌బాకింది. హైదరాబాద్‌లోనూ పెట్రోల్‌ ధర లీటరు‌ రూ.92.84కి చేర‌గా, డీజిల్‌ ధర రూ.86.93గా ఉంది. బెంగళూరులో లీట‌రు పెట్రోలు ధ‌ర రూ.92.28, డీజిల్ ధ‌ర రూ.84.49గా ఉంది. చెన్నైలో లీట‌రు పెట్రోలు ధ‌ర రూ.91.45, డీజిల్ ధ‌ర రూ.84.77గా ఉంది.

- Advertisement -