బాసర సరస్వతి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి..

269
Minister Indrakaran Reddy
- Advertisement -

బాసర సరస్వతి దేవి దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. మంగళవారం బాసర సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సరస్వతి అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..బాసర ఆలయన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేస్తుందని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. మంత్రితో పాటు ముదోల్ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -