పడిపోయిన పెట్రోల్-డీజిల్ ధరలు..

396
Petrol Price
- Advertisement -

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పతనం కావడంతో పెట్రోల్,డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.69.59 ఉండగా, డీజిల్ ధర 62.33గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.73.59 ఉండగా, డీజిల్ ధర రూ.67.82గా ఉంది. మరోవైపు అమరావతిలో పెట్రోల్ ధర 74.61, డీజిల్‌ ధర కూడా రూ.68.52 వద్దనే నిలకడగా కొనసాగుతున్నాయి. విజయవాడలో కూడా ఇంచుమించు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర రూ.75.30 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.65.21 వద్ద నిలకడగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల్లో హెచ్చుతగ్గులను బట్టి ఇంధన కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజు సవరిస్తూ ఉంటాయి.

క్రూడ్ ఆయిల్ ధరల తగ్గిపోవడంతో ఇందన ధరలు కూడా దిగివస్తాయని నిపుణులు అంచనా వేశారు. కానీ కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని రూ.3 మేర పెంచి అందరికి షాకిచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి ఏకంగా రూ.39,000 కోట్లు అదనపు ఆదాయం లభిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

- Advertisement -