ఓ వైపు భారత్‌బంద్‌..మరోవైపు పెట్రో మంట

220
bharat bandh
- Advertisement -

రోజురోజుకి పెరుగుతున్న పెట్రో ధరలకు నిరసనగా కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు ఇచ్చిన భారత్ బంద్‌ ప్రశాంతంగా జరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రజారవాణా స్తంభించిపోయింది. విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఉదయం నుంచి కాంగ్రెస్,లెఫ్ట్ పార్టీలు,వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు డిపోల ముందు బైటాయించి బస్సులు తిరగకుండా అడ్డకున్నారు.

అయితే బంద్ ప్రభావం పెట్రో ధరలపై ఏ మాత్రం కనిపించలేదు. సోమవారం పెట్రోల్,డీజిల్ ధరలు భగ్గుమన్నాయి. పెట్రోల్ ధర 23 పైసలు, డీజిల్ ధర 22 పైసల మేర పెరిగింది. దీంతో ప్రస్తుతం దేశ రాజధానిలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.80.73, రూ. 72.83కి చేరాయి. ముంబైలో 23 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.88.12 ఉండగా.. అంతే మొత్తంలో పెరిగిన డీజిల్ ధర రూ.77.32 గా ఉంది

() హైదరాబాద్‌లో పెట్రోలు ధర 25 పైసలు పెరిగి రూ.85.60 ఉండగా.. డీజిల్‌ ధర కూడా 24 పైసలు పెరిగి రూ.79.22 కి చేరింది.
() చెన్నైలో పెట్రోలు ధర 25 పైసలు పెరిగి రూ.83.91 ఉండగా.. డీజిల్‌ ధర 23 పైసలు పెరిగి రూ.76.98 కి చేరింది.
() బెంగళూరులో పెట్రోలు ధర 24 పైసలు పెరిగి రూ.83.36 ఉండగా.. డీజిల్‌ ధర కూడా 23 పైసలు పెరిగి రూ.75.18 కి చేరింది.
() కోల్‌కతాలో పెట్రోలు ధర 22 పైసలు పెరిగి రూ.83.61 ఉండగా.. డీజిల్‌ ధర కూడా 23 పైసలు పెరిగి రూ.75.68 కి చేరింది.

- Advertisement -