రోజు రోజు పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యునికి చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి తప్ప తగ్గె పరిస్థితి కనిపించడం లేదు. పెట్రోలు, డీజిల్ ధరలు మంగళవారం నాడు కూడా శాంతించలేదు. నేడు లీటరు పెట్రోలుపై 10 పైసలు, డీజిల్ పై 9 పైసల మేరకు ధర పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న క్రూడాయిల్ ధరల వల్లే పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని కేంద్రం ప్రకటించింది.
దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 82.16కు చేరగా, డీజిల్ ధర రూ. 73.87కు పెరిగింది. పెట్రోలు ధరలు అధికంగా ఉండే ముంబై విషయానికి వస్తే, లీటరు పెట్రోలు ధర రూ. 89.54కు, డీజిల్ రూ. 78.42కు చేరాయి. విజయవాడలో రూ. 86.41కి పెట్రోలు ధర, రూ. 79.30కి డీజిల్ ధర పెరిగింది. గుంటూరులో రూ. 86.61కి పెట్రోలు, రూ. 79.50కి డీజిల్ ధరలు చేరుకున్నాయి.