గ్రేటర్‌ సర్వేలో ప్రజలు పాల్గొనాలి:లోకేష్ కుమార్‌

355
ghmc
- Advertisement -

ఉత్తమ జీవన ప్రమాణాలున్న నగరాలకు ర్యాంకులు ఇచ్చి ప్రోత్సహించేందుకు ఈ నెల 29 వరకు నిర్వహిస్తోన్న సిటిజన్ సర్వేలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్‌. ఈ నెల 7 నుంచి నిర్వహిస్తున్న సర్వేలో శుక్రవారం నాటికి హైదరాబాద్ నగరం మూడో స్ధానంలో నిలిచిందన్నారు.

మొదటి స్ధానంలో సూరత్,రెండోస్ధానంలో అహ్మదాబాద్ నగరాలు నిలిచాయని చెప్పారు. దేశ వ్యాప్తంగా స్మార్ట్ సిటీలు, 10 లక్షలు పైబడిన జనాభా ఉన్న నగరాల్లో విద్యుత్, బ్యాంకింగ్‌, ఏటీఎం, స్వచ్ఛ్ భారత్‌, విద్య, ఉపాధి, వసతి, అద్దెలు, ట్రాన్స్‌పోర్టు, ఎమర్జెన్సీ సేవలు తదితర 23 ముఖ్య పౌర సదుపాయాలపై ఈ సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

దేశీయంగా, అంతర్జాతీయంగా హైదరాబాద్‌ నగర ప్రతిష్టను ఇనుమడింప జేసేందుకు ఇదొక అవకాశంగా భావించాలని అన్నారు. సిటిజన్‌ సర్వేలో పాల్గొనేందుకు మరో వారం పాటు ఉన్న వెసులుబాటును వినియోగించుకోవాలని నగర ప్రజలు, వర్తక, వ్యాపారస్తులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు సూచించారు.

- Advertisement -