వెల్లింగ్టన్ టెస్టు : భారత్ 165 ఆలౌట్

238
india vs newzealand

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో వరుస విజయాలతో దూసుకెళుతున్న భారత్‌కు న్యూజిలాండ్‌లో పేస్ పరీక్ష ఎదురైంది. కివీస్ బౌలర్ల పేస్ ధాటికి భారత బ్యాట్స్‌మెన్ విలవిలలాడిపోయారు. ఓవర్ నైట్ స్కోరు 122/5 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌ 165 పరుగులకే చాప చుట్టేసింది.టీమ్ సౌథి,జేమీసన్‌ ధాటికి టాప్ ఆర్డర్ కుప్పకూలింది. వీరిద్దరు చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు.

రహానే (46),పంత్(19),అశ్విన్(0),ఇషాంత్ శర్మ(5),షమీ(21) పరుగులు చేసి వెనుదిరిగారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఒక వికెట్ కొల్పోయి 43 పరుగులు చేసింది.

ఆరున్నర అడుగుల యువ పేసర్‌ కైల్‌ జేమిసన్‌ అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరహో అనిపించాడు. చురకత్తుల్లాంటి బంతులతో భారత్‌ బ్యాటింగ్‌ నడ్డివిరిచాడు. పదునైన స్వింగ్‌తో టార్ ఆర్డర్‌ని పెవిలియన్‌ పంపాడు. తొలిరోజు వర్షం కారణంగా ఆట రద్దైన రెండోరోజు తక్కువ పరుగులకే భారత్ వెనుదిరిగింది.