ప్రభుత్వ దీపావళి కానుక…ప్రజల హర్షం

27
cm kcr

రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం దీపావళి కానుక అందించిన సంగతి తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో 2020-21 సంవత్సరానికి గాను ఆస్తి పన్నులో రాయితీ కల్పిస్తూ తీపి కబురు తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యం ఆవరణలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రేట‌ర్‌లో 13 లక్షల 72 వేల కుటుంబాలకు లబ్ది చేకూరుతుంద‌ని….. అదేవిధంగా గ్రేటర్ వెలుప‌ల కూడా రూ.10 వేల లోపు ఆస్తిపన్ను కడుతున్న వారికి ప్ర‌భుత్వం 50 శాతం రాయితీ ఇవ్వ‌నుంద‌ని తెలిపారు.