ఆన్ లైన్‌లో వాణిజ్య న్యాయ‌స్థానాల ఫీజు చెల్లింపులు..

149
Telangana Assembly

తెలంగాణ సివిల్‌ కోర్టు చట్టం-1972, తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్టు -1956 సవరణ బిల్లులను శాసన స‌భ ఆమోదించింది. ఈ బిల్లుల‌ను న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శాస‌న స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. జిల్లా న్యాయ‌స్థానాల అప్పిలేట్ అధికారితా ప‌రిధిని రూ. 20 ల‌క్ష‌ల నుంచి రూ. 35 ల‌క్ష‌ల‌కు పెంచేందుకు ప్ర‌తిపాద‌న‌ స‌వ‌ర‌ణ బిల్లును శాస‌న స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌గా స‌భ దీనికి ఆమోదం తెలిపింది. దీంతో పాటు వాణిజ్య న్యాయస్థానాల ఫీజుల‌ను NEFT, RTGS ద్వారా ఆన్ లైన్ చెల్లింపులు చేసేందుకు ఉద్దేశించిన స‌వ‌ర‌ణ బిల్లును మంత్రి శాస‌న స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌గా… స‌భ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది.