నాగార్జున సరసన RX 100 బ్యూటీ..

101
Payal Rajput

టాలీవుడ్‌లో RX 100 సినిమాతో యువతను ఆకర్షించిన హాట్‌ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌. ప్రస్తుతం ఈ అమ్మడు రవితేజ నటిస్తున్న డిస్కోరాజా సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. RX 100లో తన అందాలతో ఆకట్టుకున్న ఈ సుందరి ప్రస్తుతం పాత్ర ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తు సినిమాలు చేసుకుంటుపోతుంది. ఈ నేపథ్యంలో ఈ బ్యూటీ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నెల్‌ ఇచ్చిందని సమాచారం.

Payal Rajput

మరి ఆ మూవీ ఏంటంటే.. నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ‘మన్మథుడు’ ఒకటి. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో నాగార్జున వున్నారు. నాగార్జున హీరోగా .. ఆయన సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితం కానుంది. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉండటంతో.. ఒక కథానాయికగా పాయల్ రాజ్ పుత్‌ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది.