” పవన్ వారాహి “.. వచ్చేస్తోందోచ్ !

35
- Advertisement -

ఏపీలో ప్రస్తుతం జనసేన పార్టీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే పవన్ చేసే వ్యాఖ్యలు, ఆయన తీసుకునే నిర్ణయాలు ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంటాయి. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో ప్రతి విషయంలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు పవన్. అయితే గత కొన్నాళ్లుగా సినిమాలపైనే దృష్టి సారించిన ఆయన.. త్వరలోనే మళ్ళీ యాక్టివ్ కానున్నట్లు తెలుస్తోంది. అప్పుడెప్పుడో వారాహి ద్వారా ప్రజల్లో ప్రచారం చేపట్టాలని భావించి అన్నీ సిద్దం చేసుకొని చివరి నిమిషంలో ప్రచారాన్ని వాయిదా వేసుకున్నారు.

దాంతో అప్పటి నుంచి పవన్ వారాహి ఎప్పుడు ప్రజల్లోకి వస్తుందా అనే క్యూరియాసిటీ పవన్ ఫ్యాన్స్ తో పాటు జనసైనికులలో కూడా ఉంది. ఒకానొక సమయంలో పవన్ వారాహి యాత్రని విరమించుకొనున్నారనే గుసగుసలు కూడా వినిపించాయి. అయితే ఇలాంటి వార్తలన్నిటికి చెక్ పెడుతూ పవన్ వారాహి యాత్ర పై నాదెండ్ల మనోహర్ తాజాగా స్పష్టతనిచ్చారు. ఈ నెల 14 నుంచి వారాహి పై పవన్ యాత్ర ప్రారంభం అవుతుందని క్లారిటీ ఇచ్చారు. తొలి విడతలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ ప్రచార యాత్ర జరుగుతుందని నాదెండ్ల చెప్పుకొచ్చారు.

Also Read: తెలంగాణ ఆచరిస్తుంది..దేశం అనుచరిస్తుంది: కేటీఆర్

ఒక్కో నియోజిక వర్గంలో 2 రోజుల పాటు పవన్ యాత్ర కొనసాగుతుందట. ఇక రోజులుగా పవన్ ప్రచారం కోసం ఎదురు చూస్తున్న జనసైనికులకు ఈ వార్త రెట్టింపు జోష్ నిచ్చింది. కాగా పవన్ చేపడుతున్న ఈ యాత్రలో ఆయన ప్రసంగం ఎలా ఉండబోతుందో అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఒకవైపు టీడీపీ తరుపున నారా లోకేశ్ పాదయాత్రలో పలు హామీలు, మరోవైపు చంద్రబాబు బహిరంగ సభలలో మేనిఫెస్టో వంటివి ఇప్పటికే ప్రకటించి ఎన్నికల వేడిని రెట్టింపు చేశారు. దీంతో పవన్ యాత్రలో ఎలాంటి హామీలు ఇబ్బబోతున్నారు. ఆయన వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: కమర్షియల్ పాలిటిక్స్.. నిజమేనా ?

- Advertisement -