తెలంగాణ ఆచరిస్తుంది..దేశం అనుచరిస్తుంది: కేటీఆర్

31
- Advertisement -

తెలంగాణ ప్రగతి దేశానికే గర్వకారణమన్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..కేసీఆర్‌ మానవీయ దృక్పథం, నిర్మాణాత్మక ఆలోచన, దార్శనీక ప్రణాళిక రచన, పారదర్శకమైన పరిపాలన.. వీటన్నింటి కలయిక అయిన తెలంగాణ మాడల్‌ నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు అందుకుంటుందని తెలిపారు.

ఇవాళ తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందనే స్థాయికి చేరుకుందని ఇది ముమ్మాటికి ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమని అన్నారు.రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యమిస్తూ సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ ముందుకుసాగుతున్నామని అన్నారు.

Also Read:CM KCR:దేశానికే తలమానికంగా తెలంగాణ అభివృద్ధి
ఆర్థిక మాంద్యం, కరోనా సంక్షోభం ఎదురైనప్పటికీ అన్నింటిని తట్టుకుని తెలంగాణ ఒక బలీయమైన ఆర్థిక శక్తిగా నిలబడగలగిందన్నారు. అప్రతిహతంగా సాగుతున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తనకంటూ ప్రత్యేకతను నిలుపుకుందన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు పదేండ్లలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు అప్పటి ప్రభుత్వాలు అరకొర నిధులు ఖర్చు చేయగా.. రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం 20 రెట్ల నిధులు అధికంగా ఖర్చు చేసిందన్నారు.

Also Read:ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు..

తెలంగాణ రాకముందు కేవలం 4200 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల 14 వ్యవసాయ గోదాములు ఆనాడు ఉంటే.. రాష్ట్ర ఏర్పాటు అనంతరం 33 కోట్లతో 55 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల ఆధునిక గోదాములను సిరిసిల్ల జిల్లాలో నిర్మించుకున్నాం అన్నారు.

- Advertisement -